ప్రొద్దుటూరులో టిడిపి గెలుపునకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తెలియదు. ఆదివారం ప్రొద్దుటూరు స్థానిక నెహ్రురోడ్డు లోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్ళకు పైగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చానన్నారు. ప్రస్తుతం కార్యకర్తలు, మిత్రుల సూచన మేరకు తనను ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండాలని కోరుకుంటూన్నారని అన్నారు. త్వరలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కలవనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ గా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి బాధ్యత నిర్వహిస్తున్నారని, ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, ఘంటసాల వెంకటేశ్వర్లు, శ్రీనివాసులరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.