రాష్ట్రంలో పేదప్రజల నడ్డి విరిచే విదంగా వైసీపీ ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలకు నిరసనగా సోమవారం ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ దగ్గర వున్న సబ్ స్టేషన్ వద్ద మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ బత్యాల చెంగలరాయుడు అన్నారు. ఆయన ఆదివారం రాజంపేటలో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియ చెబుతామన్నారు. ఒంటిమిట్ట మండలంలో వున్న అన్ని పంచాయతీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.