కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లి నందు మా నమ్మకం నువ్వే జగన్ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం, మండలంలోని రాచపల్లి నందు రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరుగుతుందని రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి సలహాదారులు తెలిపారు. ఆయన ఆదివారం రాజంపేటలో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ అకేపాటి అమరనాథ్ రెడ్డి హాజరవుతారని ఆయన తెలిపారు. కావున మండల పరిధిలోని వైకాపా పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొనవలసిందిగా ఆయన కోరారు.