ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన జరిగింది. వారణాసి ప్రాంతంలో బిల్డింగ్ వద్ద ఓ చిన్నారి సైకిల్ ఆడుకుంటూ ఉండగా అటుగా వచ్చిన వ్యక్తి బాలుడిపై దాడి చేశాడు. చిన్న తప్పిదానిపై అతడి చెంప వాయించాడని తెలుస్తోంది. అనంతరం చిన్నారి సైకిల్‌ను నేలకేసి బాది విరగ్గొట్టాడు. సదరు వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా అతడిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.