పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో సోమవారం పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తునట్లు సీఐ ఆశీర్వాదం, ఎస్సై రవిప్రకాష్ రెడ్డి తెలిపారు. కల్లూరు జడ్ పీ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని సోమవారం వారు తనిఖీ చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ రాజా రెడ్డి ఎస్బీ కానిస్టేబుల్ శ్రీనాధ్ పాల్గొన్నారు.