ఇటీవల కాలంలో కార్లలో సాంకేతిక సమస్యలు తలెత్తి దగ్ధమవుతున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని ఎటా సమీపంలోని అలీగంజ్ పట్టణంలో ఓ కదులుతున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన కారు డ్రైవర్ కారులోంచి దూకి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.