పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై ప్రశంసలు కురిపించారు. పాకిస్థాన్ గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, తమ ప్రభుత్వం కూలిపోకపోయుంటే భారత్ లాగే రష్యా నుండి చవకగా చమురు కొనుగోలు చేసేవాళ్లమని అన్నారు. భారత ప్రధాని మోదీ రష్యా నుండి ముడి చమురును చౌకగా కొనుగోలు చేస్తున్నారని పొగిడారు. చమురు విషయంలో పాక్ ప్రధానిని విమర్శించి భారత ప్రధాని మోదీని పొగిడారు.