కుప్పం నియోజకవర్గంలో టీడీపీకు షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళ్ళితే... రామకుప్పం మండలంలోని బల్ల పంచాయతీకి చెందిన 15 టీడీపీ కుటుంబాలు ఆదివారం స్థానిక సర్పంచ్ విజయ్ థామస్, వైయస్ఆర్సీపీ మండల కన్వీనర్ విజలాపురం బాబురెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ భరత్ వారికి వైయస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.