వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు మేరకు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను ). విజయనగరం పార్లమెంటు సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ ( పెదబాబు) సూచనల మేరకు సోమవారం పోలాయవలస గ్రామం లో జగనన్నే మా భవిష్యత్తు అనే ఈ కార్యక్రమం నిర్వహించారు. మొల్లి అప్పన్న (మాజీ సర్పంచ్ , తెట్టంగి సచివాలయం కన్వీనర్ ) ప్రతీ గడపకు వెళ్ళారు. ఈ సందర్భంగా సచివాలయం కన్వీనర్ మొల్లి అప్పన్న మాట్లాడుతూ ..ఈ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించి . వారి అనుమతితో మొబైల్ స్టిక్కర్, కరపత్రాలు అందజేసినట్లు చెప్పారు. జగనన్న కు మద్దతు తెలిపే ప్రతి కుటుంబం 8296082960 నంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పారు. కార్యక్రమంలో సచివాలయం వాలంటీర్లు, గృహ సారథులు, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.