సోమవారం ఉదయం 8:30 గంటలకు విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం గుజ్జింగివలస గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా మా నమ్మకం నువ్వే జగనన్న.. ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గం పరిశీలకులు కే.వి.సూర్యనారాయణరాజు(పులిరాజు) ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి తిరుగుతూ స్వయంగా జగనన్న స్టిక్కర్లను ప్రజల అనుమతితో అతికించారు. ఇప్పటివరకు అందిన జగనన్న సంక్షేమ పథకాల గురించి వివరించి ప్రజల నుంచి మద్దతు తీసుకున్నారు. కార్యక్రమంలో మండల జేసీఎస్ కన్వీనర్ బెల్లాన బంగారు నాయుడు, జడ్పీటీసీ శీర అప్పల నాయుడు , ఎంపీపీ ప్రతినిధి పొట్నూరు సన్యాసి నాయుడు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచ్ వైస్ సర్పంచ్ , సచివాలయ కన్వీనర్లు, వాలంటరీలు, గృహసారథులు, కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు.