మంగళగిరి నియోజకవర్గం కోతపేట 1వ వార్డ్ లో "జగనన్నే మా భవిష్యత్తు" కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలను సేకరించి గత ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నారు. సంక్షేమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు సాగిస్తున్న కుట్రలను, విషప్రచారాన్ని ప్రజాక్షేత్రంలో తేటతెల్లం చేస్తూ గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు ముందుకు సాగుతున్నారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్లను ఆయా ఇళ్ల గోడలు, తలుపులపై అంటించి ప్రజామద్దతు కోరుతున్నారు.