ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం. దీని ప్రకారం బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వాయువ్యం చంద్రుడిది. చంద్రుడు ధనప్రవాహానికి అధిపతి. కాబట్టి డబ్బు, నగలు భద్రపరుచుకునే బీరువా ఉత్తర వాయువ్యంలో అనగా పశ్చిమానికి, ఉత్తరానికి మధ్యన ఉండే మూలలో ఉంచాలి. అలాగే బీరువాను దక్షిణ దిక్కున పెట్టినా మంచిదట. బీరువాను నైరుతి మూలలో మాత్రం ఉంచకూడదు.