ఉమ్మడి గుంటూరుజిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. ఏప్రిల్ రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకోవడంతో జనం అల్లాడిపోతున్నారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గురజాల, గుంటూరు, బాపట్ల చీరాల ప్రాంతాల్లో రద్దీగా ఉండే ప్రధాన రహదారులు మధ్యాహ్నం1: 00 గంట నుంచి సాయంత్రం 4: 00గంటల వరకు జనం రాకపోకలు లేక బోసిపోతున్నాయి. దీనికి తోడు ఉక్కపోతతో వృద్ధులు, పిల్లలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పలువురు డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa