తెనాలి: పెదరావూరు ఎస్సీ కాలనీలో ఒంటరిగా తిరుగుతున్న ఓ గుర్తు తెలియని బాలుడు (16) ని కాలనీవాసులు సోమవారం గుర్తించారు. ఆ బాలుడిని అదుపులోకి తీసుకొని రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఎస్సై చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు బాలుడు పరిస్థితిని పరిశీలించి శరీరంపై చిన్న చిన్న గాయాలు ఉన్నాయని చెవిటి, మూగ మతిస్థిమితం లేని బాలుడిగా గుర్తించారు. ఎవరికైనా బాలుడి సమాచారం తెలిస్తే రూరల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.