గుంటూరు: కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు సర్వజన ఆస్పత్రిలో ప్రస్తుతం 18 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు గర్భిణీలు ఒక బాలుడు ఉండడం గమనార్హం. గుంటూరు వైద్య కళాశాలలో సోమవారం 16 నమూనాలను పరీక్షించగా తొమ్మిది మందికి పాజిటివ్ గా తేలింది. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై సన్నద్ధం పై సోమవారం సాయంత్రం జీజీహెచ్ లో మార్క్ డ్రిల్ నిర్వహించారు. కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చే వారందరికీ వెంటనే పరీక్షలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు.