కళ్యాణదుర్గం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మహాత్మా జ్యోతీరావ్ ఫులే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే. వి. ఉషాశ్రీచరణ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతమాత ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి నిరంతరం కృషి చేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతీరావ్ ఫులే అన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.