ప్రకాశం జిల్లా గిద్దలూరు విట్ట సుబ్బరత్నం కళ్యాణమండపంలో మంగళవారం గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో గృహసారథులు వాలంటరీలు సచివాలయ కన్వీనర్లతో ప్రత్యేక సమావేశాన్ని మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు పాల్గొని గృహసారథులకు వాలంటరీలకు గ్రామ సచివాలయ కన్వీనర్లకు తగు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలంటూ వారికి అవగాహన కల్పిస్తారని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.