వేసవికాలం వచ్చేసింది. ఈ కాలంలో శరీర ఉష్ణోగ్రత అసాధారణంగా పెరుగుతుంది. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ గురై అలసట పెరుగుతుంది. రోజూ క్రమం తప్పకుండా నిమ్మరసం, కొబ్బరినీళ్లు తాగడం ద్వారా శరీరం చల్లబడుతుంది. రోజూ ఉదయం కొబ్బరి నూనె లేదా పొద్దు తిరుగుడు నూనెతో శరీరానికి మర్ధన చేసుకుని స్నానం చేయడంవల్ల కూడా బాడీ కూల్ అవుతుంది. రోజూ రెండు కప్పులు తాటి బెల్లం కలిపిన నీళ్లను తాగడం ద్వారా శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.