ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలంలోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో సోమవారం మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని అన్నారు. అలానే రైతులు సేంద్రియ ఎరువుల వాడకం వలన తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి సాధించవచ్చు అని అన్నారు. రైతులు ప్రభుత్వం అందజేసే సబ్సిడీని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రామంలోని రైతులు పాల్గొన్నారు.