జమ్మలమడుగు నియోజకవర్గంలో పెద్దముడియం లోని మసీదు అభివృద్ధికి రూ. 5 లక్షల నిధులు మంజూరు అయినట్లు మండల కన్వీనర్ చవ్వ కృష్ణారెడ్డి సోమవారం తెలిపారు. పెద్దముడియం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించినప్పుడు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి దృష్టికి ముస్లింలు మసీదు అభివృద్ధికి నిధులు మంజూరుకు కృషి చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఉన్నతాధికారులతో మాట్లాడి మసీదు అభివృద్ధికి రూ. 5 లక్షల నిధులు రూ. 50 వేలు తన సొంత నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లింల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు గ్యాస్ శివారెడ్డి, అంజిరెడ్డి, ప్రసాద్ రెడ్డి, కే షఫీ పాల్గొన్నారు.