గుజరాత్ సూరత్ లోని మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9న ‘శారీ వాకథాన్’ నిర్వహించారు. మహిళల్లో ఫిట్ నెస్ పై అవగాహన కల్పించేందుకు దేశంలోనే తొలిసారి ఈ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 3 కి.మీ సాగిన ఈ వాకథాన్ లో కేంద్ర జౌళి, రైల్వే శాఖ సహాయ మంత్రి, మేయర్, మున్సిపల్ కమిషనర్ తో పాటు ఇతర రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. నెటిజన్లు దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.