ప్రతి నిరుపేదకు నవరత్నాలలో కూడిన సంక్షేమ ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని జమ్మలమడుగు శాసనసభ్యులు డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కన్నెలూరులోని సచివాలయ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చైర్పర్సన్ వేల్పుల శివమ్మతో కలిసి నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటింటికీ అధికారతో కలిసి వెళ్లారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పరిపాలనలో పెను మార్పులు తీసుకొని వచ్చారు. వార్డు , గ్రామ సచివాలయం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు నేరుగా వారి ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. క్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.