రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్టులకు చెల్లించవలసిన బిల్లులు చెల్లించకపోవడంపై కాంట్రాక్టర్లు అందరు కలిసి ఆందోళన చేపట్టారు. మంగళవారం, విజయవాడ, బందర్ రోడ్డులోని ఆర్ అండ్ బి భవనం వద్ద కాంట్రాక్టర్లు ప్లకార్డులతో నిరసనలు తెలుపుతున్నారు. బిల్డింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా , స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. కాంట్రాక్టర్లు రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులను కలిసి బిల్లులు చెల్లించాలంటూ ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa