ఏపీ ప్రజలకు శుభవార్త. నేడు అర్హులైన మహిళల ఖాతాలో సీఎం జగన్ రూ.15 వేల చొప్పున జమ చేయనున్నారు. వైయస్సార్ ఈ బీసీ నేస్తం పథకం ద్వారా బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య రెడ్డి, కమ్మ, కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న పేద మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. సుమారు 4,39,068 మంది మహిళల ఖాతాల్లో రూ. 458.60 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.