తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తుల కోసం కాపర్, స్టీల్ వాటర్ బాటిళ్లను స్వయంగా విక్రయించాలని నిర్ణయించింది. ప్రైవేటు రంగంలో వీటి ధర అధికంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లీటర్ కాపర్ బాటిల్ రూ.450, స్టీల్ బాటిల్ రూ.200కు విక్రయించనుంది. ప్రస్తుతం పద్మావతి విచారణ కేంద్రంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా, ఇతర ప్రాంతాల్లోనూ ప్రారంభిస్తామని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa