ప్రకాశం జిల్లా కొమరోలు ఎంపీపీ కామూరి అమూల్య మంగళవారం వాలంటరీలకు నియామక పత్రాలను అందజేశారు. ఇటీవల కొమరోలు మండలంలో కాళీ ఏర్పడ్డ వాలంటరీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వాలంటరీలకు నియామక పత్రాలను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సక్రమంగా అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయాల్సిన బాధ్యత తమ పైన ఉందని వాలంటరీలతో ఎంపీపీ అమూల్య అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.