ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక కిట్లు అందాలని మంగళవారం జేవీ జేడీ వెంకటకృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. తంబళ్లపల్లి నియోజక వర్గంలోని తంబళ్లపల్లి, పెద్దమండెం, ములక చెరువు, బి. కొత్తకోట, పిటిఎం జడ్పీ ఉన్నత పాఠశాలలను జెడి ఆకస్మికంగా తనిఖీచేసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. జగనన్న విద్యా కానుక పంపిణీ కోసం ఆయా పాఠశాలల్లో కిట్లను భద్రపరిచి జూన్ లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.