ఓ ఎద్దు బట్టల షాపులోకి చొరబడి బీభత్సం సృష్టించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. దాద్రీ ప్రాంతంలోని ఓ బట్టల షాపులోకి ఎద్దు అకస్మాత్తుగా ప్రవేశించింది. దీంతో షాపులో ఉన్నవారు ఎద్దును వెళ్లగొట్టేందుకు యత్నించగా, ఎద్దు భయపడి షాపు అంతా గందరగోళం చేసింది. షాపులో ఉన్నవారిపై ఎద్దు దాడి చేసేందుకు యత్నించడంతో వారు పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు.