మహీంద్రా అండ్ మహీంద్రా ఎమెరిటస్ ఛైర్మన్ కేషుబ్ మహీంద్రా(99) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఛైర్మన్ పవన్ కె గోయెంకా ట్విట్టర్‌లో ధృవీకరించారు. కేషుబ్ మహీంద్రా 1947లో తన తండ్రి కంపెనీ మహీంద్రాలో చేరాడు. అనంతరం 1963 నుండి 2012 వరకు ముంబై-లిస్టెడ్ సమ్మేళనానికి ఛైర్మన్‌గా ఉన్నాడు. రిటైర్మెంట్ అనంతరం తన వారసుడిగా మేనల్లుడు ఆనంద్ మహీంద్రాను నియమించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa