కోల్ కతాలోని నార్త్ 24 పరగణాల జిల్లాలోని హెలెంచకు చెందిన మింటూరాయ్ అనే రైతు తన ఇంటిని టైటానిక్ షిప్ తరహాలో ఇంటిని నిర్మించుకున్నాడు. తనకు సహాయం చేసేందుకు ఏ ఇంజినీర్ సిద్ధంగా లేకపోవడంతో మింటూనే నేపాల్ లో మూడేళ్లు తాపీ పని నేర్చుకున్నాడు. అనంతరం ఓడ మాదిరిగా తన సొంతింటి కల నెరవేర్చుకునేందుకు 2010లో నిర్మాణం ప్రారంభించాడు. దీని కోసం రూ.15 లక్షలు ఖర్చైనట్లు తెలిపాడు. ఈ ఇల్లు వైరల్ గా మారింది.