పల్నాడు జిల్లా మాచర్లలో మంగళవారం అర్ధరాత్రి యువకులు వీరంగం సృష్టించారు. కొందరు యువకులు అర్థరాత్రి దాటిన తర్వాత కర్రలు, రాడ్లు చేతబూని పరస్పరం దాడికి దిగారు. దీంతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఓ వర్గానికి చెందిన యువకులు మరో వర్గానికి చెందిన యువకులపై పాత కక్షల నేపథ్యంలో దాడి చేశారు. వివాదం పెద్దది కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరకొట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa