గుంటూరు జిల్లా నుదురు పాడు సమీపంలో బుధవారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చిన టాటాఏస్ వాహనం ఢీ కొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెనుక ఉన్న హెడ్ కానిస్టేబుల్ బ్రిడ్జిపై నుంచి ఎగిరి కింద పడ్డాడు. హెచ్‌సి కొన ఊపిరితో ఉన్నాడు. వాహనం నడుపుతున్న ఈపూరు మండలం గుండేపల్లికి చెందిన నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. కాలు, చేయి నుజ్జు, నుజ్జు అయ్యింది. హుటాహుటిన 108 వాహనంలో వారిని జీజీహెచ్‌కు తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తున్నారు.