గుంటూరు: కోవిడ్ ఎమర్జెన్సీ ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ అమర్త లూరి శ్రావణ్ బాబు అన్నారు. మంగళవారం జీజీహెచ్ లో కోవిడ్ మాక్ డ్రిల్ జరిగింది. కోవిడ్ పాజిటివ్ కేసులు జీజీహెచ్ కు వస్తే వారికి ఏవిధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలి, వార్డుల్లోకి ఏ విధంగా తరలించాలి, అవసరమైతే ఆక్సిజన్ ఏ విధంగా అందించాలనే విషయాలపై వైద్యులు, వైద్య సిబ్బందికి మాక్ డ్రిల్ నిర్వహించారు.