మన దేశంలో వరుస భూకంపాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామున బిహార్, పశ్చిమ బెంగాల్‌లో భూకంపం సంభవించగా తాజాగా జమ్మూ కశ్మీర్‌ను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది. బుధవారం ఉదయం 10.10 గంటలకు జమ్మూ కశ్మీర్లో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నేల నుంచి10 కిలో మీటర్లు లోతులో భూకంప కేంద్రం ఉందని గుర్తించింది.