మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని, కుటుంబానికి భరోసాగా బతకాలన్నదే సీఎం వైయస్ జగన్ ఆలోచన అని, అందుకే అక్కచెల్లెమ్మల పేరుమీదే అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మార్కాపురంలో వైయస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం రెండో విడత అమలు కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన పాల్గొని మాట్లాడారు. ``ఈ రాష్ట్రంలోని ప్రతి పేద మహిళ కష్టం, ఉన్నతి పట్ల ఎంత అంకితభావంతో ఉన్నందున ఆ నారీలోకమంతా సీఎం వైయస్ జగన్‌ను దీవించారు, అందుకే సకాలంలో వర్షాలు, ప్రాజెక్టులు నిండాయి, అధికంగా దిగుబడులు వచ్చాయి, నారీలోకం పండుగ చేసుకుంటుంది. పేదరికం అనే పెద్ద రోగాన్ని తరిమేయాలని సీఎం వైయస్ జగన్ తపస్సు చేశారు, అగ్రవర్ణ పేద మహిళలకు ఈబీసీ నేస్తం పేరుతో మూడేళ్ళపాటు ఏటా రూ. 15 వేల చొప్పున సాయం చేస్తున్నారు. బటన్ నొక్కగానే అక్కచెల్లెమ్మల బ్యాంక్ ఖాతాలకు నేరుగా చేరుతున్నాయి, ఏ మహిళ అయినా భరోసాగా బతకాలన్నదే సీఎం ఆలోచన, మహిళలను దేశానికి ఆదర్శంగా, జ్యోతిరావుపూలే బాటలో ముందుకెళుతున్నారు. ముందుతరాలకు కూడా భరోసానిచ్చే పాలన అందజేస్తున్న సీఎం వైయస్ జగన్‌కి ధన్యవాదాలు`` అని మంత్రి చెల్లుబోయిన అన్నారు.