ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మరో 10 సంవత్సరాల్లో అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రరాష్ట్రం తయారవ్వబోతోందని మార్కాపురం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు. ఈ నాలుగేళ్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో రూ.1100 కోట్లతో మార్కాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెప్పారు. సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, అదే విధంగా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. వైయస్ఆర్ ఈబీసీ నేస్తం రెండో విడత అమలు కార్యక్రమాన్ని మార్కాపురంలో నిర్వహించారు.