గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా చేస్తున్న మేలును ఇంటింటా వివరించి.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైయస్ఆర్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావారణంలో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 15,004 సచివాలయాల పరిధిలో 1.65 కోట్ల కుటుంబాల్లోని ఐదు కోట్ల మందిని నేరుగా కలవడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది.