సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలంలోని ఎరికంబట్టు సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు రైతులకు అందుబాటులోకి ప్రభుత్వ కార్యాలయాలు వచ్చాయని ప్రజలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుమన్ కుమార్, ఎంపీపీ దివాకర్ రెడ్డి, వైసిపి నాయకులు, సర్పంచ్ పాల్గొన్నారు.