కర్ణాటక ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన టికెట్ల జాబితా పార్టీలో తీవ్ర అసమ్మతిని రాజేసింది. బెళగావి జిల్లా అథని టికెట్ తనకు రాకపోవడంతో మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ లక్ష్మణ్ సావడి పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గురువారం సాయంత్రం తాను కీలక నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి.