కాణిపాక ఆలయంలో మూలవిరాట్ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన ఘటనపై చైర్మన్ మోహన్ రెడ్డి స్పందించారు. కాణిపాక వినాయక స్వామి మూలవిరాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిపై త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఆలయంలోకి అధికారులు గానీ, అర్చకులు గానీ, హోంగార్డ్స్ ప్రతి ఒక్కరు సెల్ఫోన్లు తీసుకుని వెళ్లడం నిషేధమని జీవో విడుదల చేసినట్లు తెలిపారు. మూల విరాట్ ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ అయిన విషయం మీడియాలో ప్రసారం కావడంతో తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే సీసీ కెమెరాల నిఘాతో నిరంతరాయం పర్యవేక్షిస్తున్నమని తెలిపారు. మరల ఇలాంటి సంఘటన పురావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని... ఇలాంటి ఘటనల వల్ల ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని చైర్మన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.