ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేరస్తుల్ని వదిలేసి, ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తారా...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 12, 2023, 02:14 PM

 టీడీపీ మహిళా నేత ముల్పూరి కళ్యాణి అక్రమ అరెస్ట్‌పై చర్యలు కోరుతూ జాతీయ మహిళా కమిషన్, డీజీపీకి తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ రాశారు. గత మూడున్నరేళ్లలో డ్రగ్స్ నేరాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిందన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగంతో పాటు మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి నేరాల నియంత్రణకు బదులుగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటోందని మండిపడ్డారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేస్తే టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com