మధుమేహం, అధిక రక్తపోటు ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలు. హైబీపీతో కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెటీనాలోని రక్తనాళాల్లో మార్పులు జరిగి కంటి చూపుపై ప్రభావం చూపుతుందంటున్నారు. హైబీపీ మాత్రలు రోజూ వేసుకోవాలని, ఎక్కువ సేపు టీవీ, మొబైల్ స్క్రీన్ చూడడం తగ్గించాలంటున్నారు. ధూమపానం మానాలని తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచిస్తున్నారు.