రాహుల్‌గాంధీపై జరిగిన దాడికి దేశ వ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ ఖండిస్తే మన రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి, చంద్రబాబునాయుడు ఖండించలేని పరిస్థితిలో ప్రధాని మోదీకి కొమ్ము కాస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే మస్తాన్‌వలీ అన్నారు. నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెంలోని పద్మావతి కల్యాణ మండపంలో జరిగిన కోవూరు నియోజకవర్గ స్థాయి సమావేశంలో మస్తాన్‌వలీతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరి దేవకుమార్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాటుపడిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి జగన్మోహన్రెడ్డి కేవలం కొడుకే కానీ.. రాజకీయ వారసుడు కాదన్నారు. రాహుల్‌గాంధీపై పార్లమెంట్లో జరిగిన దాడి కాంగ్రెస్ పార్టీకి మైలేజీ పెంచిందన్నారు. అదానీ దుర్మార్గానికి డొల్ల కంపెనీల పేరుతో రూ. 20వేల కోట్లు భారత జాతికి నష్టం వాటిల్లిందన్నారు. దీనిపై రాహుల్‌గాందీ ప్రశ్నిస్తే అది ప్రజలకు తెలుస్తుందని కుట్రపన్ని ఆయనపై మోదీ, అమిత్‌షా కుట్రపన్నారన్నారు.