ఏపీలోని రాజకీయ నేతల్లో మంచి పేరు, ప్రఖ్యాతులు ఉన్న ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు వైసీపీ ట్రాప్‌లో పడి అపఖ్యాతి పాలుకావద్దు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హితవు పలికారు. ఈ సందర్భంగా అయన ఆయన మీడియాతో మాట్లాడుతూ..... ‘‘ఈనాడు, మార్గదర్శి సంస్థలపై ఉండవల్లితో ఢిల్లీలో బుధవారం అసత్యాలు, అవాస్తవాలను వెల్లడించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇందుకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు నేతృత్వం వహిస్తున్నారు. ఆయన రాజకీయ దళారీగా వ్యవహరిస్తున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ కేవలం ఆరు నెలలే తన హవా చూపగలరు. ఆ తరువాత ప్రభుత్వం మారుతుందన్న వాస్తవాన్ని ఆయన గుర్తించాలి’’ అని కోటంరెడ్డి అన్నారు.