వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆదాయం తగ్గి... ఖర్చులు పెరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. జగన్ మా భవిష్యత్తు కాదు, జగనే మా నమ్మకం కాదని... జగన్ రాష్ట్రానికి పట్టిన దరిద్రమని విరుచుకుపడ్డారు. బయట రాష్ట్రాల నాయకులు మనల్ని చూసి జాలి పడుతున్నారని తెలిపారు. ‘‘నిన్ను నాశనం చేసే పార్టీని నువ్వు మొస్తావా... సమాజాన్ని నాశనం చేసే పార్టీని మోస్తావా. ఈ నియోజకవర్గంలో కొత్తగా చిన్న సైకో తయారయ్యాడు. ఇలాంటి రౌడీయిజాన్ని అణచివేస్తాం’’ అని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో ఈ పోలీసులే బాగా పనిచేశారని తెలిపారు. రాజధాని పోయింది, ఉద్యోగాలు పోయాయి కానీ ప్రజల్లో మాత్రం చైతన్యం రాలేదన్నారు. అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 3 స్థానాలు గెలిచామని... తాను అనుకున్న చైతన్యం ఇప్పుడు వచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మన:సాక్షితో ఓటు వేయాలని కోరామని తెలిపారు. 23 ఓట్లు.. 23వ తేదీన.. 23 సంవత్సరం గెలిపించారని.. ఇది కాదా దేవుడి స్ర్కిప్ట్ అంటే.. అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.