ఎప్పుడో ఒకసారి సీఎం జగన్ బయటకొచ్చి అంకెల గారడీతో ప్రజల్ని మోసం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ఈబీసీ పథకం పేరుతో మహిళల్ని పచ్చి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 సార్లు బడ్జెట్‌లు పెట్టారు, ఏనాడైనా ఒక్క రూపాయి ఈబీసీలకు కేటాయించారా? అని ఆమె ప్రశ్నించారు. ఈబీసీలకు రుణాలు లేవు, సబ్సిడీ లేవు, పించన్లు ఇచ్చి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయంలో బ్రాహ్మణలుకు రూ. 280 కోట్లు ఆర్యవైశ్యులకు రూ. 50 కోట్లు క్షత్రియులకు 50 కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు. 4 ఏళ్లలో అగ్రవర్ణ కార్పోరేషన్లకు రూ. 1 ఖర్చు చేశారా, ఒక్కరికైనా రుణం ఇచ్చారా?, అన్నివర్గాలకు ఇచ్చే ఫించన్లు, రేషన్ బియ్యం తప్ప ప్రత్యేకంగా ఈబీసీలకు మీరు ఇచ్చేందిటి? టీడీపీ హయాంలో స్కాలర్షిప్పులు, ఫీజు రీయంబర్స్ మెంట్ ద్వారా 80 లక్షల మందికి ఇచ్చాం, మీరెంత మందికి ఇచ్చారు? అని ఆమె ప్రశ్నించారు.