ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్యలో పర్యటించనున్నారు. శ్రీరామ జన్మభూమిలో కొలువుదీరిన బాలరాముడిని ఆయన దర్శించుకోనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది.షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11 గంటలకు అయోధ్య చేరుకుంటారు. అనంతరం నేరుగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌కు వెళతారు.ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, సుమారు మూడు గంటల పాటు ఆయన ఆలయ ప్రాంగణంలోనే గడపనున్నారు. ఈ సమయంలో శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దర్శనం పూర్తయిన తర్వాత, మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి ఆయన నేరుగా విజయవాడకు చేరుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa