1984లో దేశంలో బీజేపీకి రెండు సీట్లు ఉంటే.. . కాంగ్రెస్‌కి 404 సీట్లు. 2014లో ఏడు శాతం నుంచి31శాతం బీజేపీకి ప్రజా మద్దతు పెరిగింది. కాంగ్రెస్‌కి 19.3శాతం 44 సీట్లు వచ్చాయి. 2019లో బీజేపీకి 303, కాంగ్రెస్‌కి 52 సీట్లు వచ్చాయి. ఎన్నికలలో గెలుపు, ఓటమి సహజం అయినా... పరిస్థితి బట్టి నిర్ణయాలు ఉండాలి. ప్రజల మధ్యన నేను ఉండాలా లేదా అని ఆలోచించా. కాంగ్రెస్ వల్ల ప్రజలకు చేరువ కాలేనని అర్ధం అయ్యింది. బీజేపీలో ఉంటే ప్రజలకు దగ్గర కావచ్చనే నేను చేరాను. అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది త్వరలోనే మాట్లాడతా. అన్ని ప్రాంతీయ పార్టీల తీరు పైనా అప్పుడు స్పందిస్తా. బీజేపీ బలోపేతం కోసం నా వంతుగా కృషి చేస్తా’’ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.