బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. దేశంలో సిద్ధాంతాల పోరాటంలో ప్రతిపక్ష పార్టీల ఐక్యత దిశగా ఈరోజు చారిత్రాత్మక అడుగు వేశామని రాహుల్ గాంధీ అన్నారు.