నేపాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాగ్ మతి రాష్ట్రం సింధూరి జిల్లాలో కారు లోయలో పడటంతో నలుగురు భారతీయ ప్రయాణికులు మృతిచెందారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరేందుకు ఆలస్యం కావడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ముగ్గురు మృతిచెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వీరంతా బీహార్ రాష్ట్రానికి చెందినవారుగా తెలుస్తోంది.